హైదరాబాద్లో ఈ నెల 18న జరగనున్న భాజపా మహా సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పలువురు రాజకీయ పార్టీ నాయకులు భాజపాలో చేరనున్నారు. భాజపా విధానాలకు ఆకర్షితుడినై కమలంలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేత, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకులు డాక్టర్ మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా తెలిపారు.
భాజపాలో చేరనున్న సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత - భాజపా
ఈ నెల 18న భాజపాలో చేరుతున్నానని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నాయకులు డాక్టర్ మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా వెల్లడించారు.
తనతో పాటు దళిత బహుజన మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ కుమారస్వామి భాజపా తీర్థం పుచ్చుకుంటారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, విధానాలకు ఆకర్షితులమై తాము భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలు, ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆమోదం, 370 ఆర్టికల్ రద్దు తదితర జాతీయ ఆంశాలను ఎంతో నేర్పుతో పరిష్కరిస్తున్నారని తెలిపారు. 18న నుంచి పటాన్ చెరు నుంచి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా?