తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా, తెరాస పార్టీలు డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్నాయి: వీహెచ్​ - దుబ్బాక ఉప ఎన్నికల తాజా వార్తలు

దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా, తెరాస పార్టీలు డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఉపఎన్నికలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏన్నడూ చూడలేదని ఆ పార్టీ సీనియర్​ నేత వి.హనుమంతరావు‌ ఆవేదన వ్యక్తంచేశారు.

భాజపా, తెరాస పార్టీలు డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్నాయి: వీహెచ్​
భాజపా, తెరాస పార్టీలు డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్నాయి: వీహెచ్​

By

Published : Oct 27, 2020, 5:25 AM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెరాస, భాజపా... ప్రజలను మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంత రావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ... తెరాస, భాజపా ప్రభుత్వాల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లుతున్నట్లు ఆయన వివరించారు.

పోలీసులు డబ్బులు తెచ్చి ఇంట్లో పెడుతున్నారని ఒకరు, నోటీసులు లేకుండా పోలీసులు ఎలా తనిఖీ చేస్తారని ఇంకొకరు అనడం చూసి....జనం నవ్వుతున్నారని వీహెచ్‌ ఎద్దేవా చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:మీ తప్పు లేదని నిరూపించుకోండి: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details