తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: గజ్వేల్ 'దళిత గిరిజన ఆత్మగౌరవ సభ'ను సక్సెస్ చేయాలి

టీపీసీసీ(TPCC) పొలిటికల్ అఫైర్స్​ కమిటీ సమావేశం శనివారం ఆన్​లైన్​లో(ONLINE) నిర్వహించారు. గజ్వేల్ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

congress-party-political-affairs-committee-meeting-about-gajwel-dalitha-girijana-atma-gaurava-sabha
congress-party-political-affairs-committee-meeting-about-gajwel-dalitha-girijana-atma-gaurava-sabha

By

Published : Sep 12, 2021, 10:45 AM IST

గజ్వేల్ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి శనివారం జరిగే పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం... ఈసారి ఆన్​లైన్(ONLINE) వేదికగా జరిగింది. పీసీసీ ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో గజ్వేల్ సభపైనే ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. ఇందులో భాగంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గాంధీభవన్​లో నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు.

గజ్వేల్​లో 17న జరగనున్న దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా(DALITHA GIRIJANA ATMA GAURAVA DANDORA) సభ కోసం ఈ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్(CONGRESS PARTY) నేతలు హాజరుకావాలని కోరారు. అలాగే దళిత దండోరా సభ... హుజురాబాద్ ఉప ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పీసీసీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:tragedy: మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య... కారణం అదేనా!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details