తెలంగాణ

telangana

ETV Bharat / state

T Congress leaders Delhi Tour : త్వరలో దిల్లీకి టీ-కాంగ్రెస్.. ఎన్నికల వ్యూహంపై చర్చ

Congress Party On Telangana Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి తమ పార్టీలను ప్రభావింతంగా తీసుకెళ్లేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ పార్టీలో మరింత జోష్​ వచ్చింది. ఎలాాగైనా ఈసారి ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది.

Congress
Congress

By

Published : Jun 6, 2023, 1:45 PM IST

Congress Party plan for Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. వ్యూహాలు ప్రతి వ్యూహాలు, సమావేశా​లు ఊపందుకున్నాయి. తమ పార్టీలను ప్రజల్లోకి ఇంకా ప్రభావంగా తీసుకెళ్లడానికి ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకులు దిల్లీకి వెళ్తూ.. పార్టీ అధిష్ఠానంతో వరుస భేటీలు జరపుతూ.. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

T Congress leaders Delhi Tour :ఇందులో భాగంగానే కర్ణాటకలో విజయ ఢంకా మోగించిన హస్తం పార్టీ అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా విజయాన్ని సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లోని నాయకులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలను వీడిన నాయకులపై హస్తం కన్నేసింది. ప్రస్తుతం ఆ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను గాంధీభవన్​ మెట్లెక్కించేందుకు చర్చలు జరుపుతోంది. సీట్లు ఇవ్వడానికి ప్రత్యేక సర్వేలు చేస్తోంది.

Congress Party On Telangana Elections 2023 : ఈ నేపథ్యంలోనే త్వరలోనే పార్టీ అధిష్ఠానంతో రాష్ట్ర నాయకత్వం భేటీ కానుంది. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా ఆయనతో పార్టీ పీసీసీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు ఉన్నారు. వీరంతా అమెరికా నుంచి తిరిగి రాగానే....రాష్ట్ర నేతలంతా అధినాయకత్వంతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో రాష్ట్ర నాయకులు సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరో ఆర్నెళ్లలో ఎన్నికలు జరగనుండగా.... కర్ణాటక ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని కొనసాగించే వ్యూహాలపై అధిష్ఠానం రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం సీట్లు ఎవరికి ఇస్తే పార్టీకి గెలుపు దిశగా వెళుతుంది అనే అంశాన్ని పెట్టుకుని అధిష్ఠానం.. రాష్ట్ర నాయకులపైన ప్రత్యేకంగా సర్వేలు చేస్తోంది. వాటి ఫలితాలను బట్టి చర్చలు జరిపి టికెట్​లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి నాయకుడు ప్రజల్లో ఉండటం షురూ చేశారు. హైదరాబాద్​లో ఉండే నేతలు కూడా పల్లెబాట పడుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసును ఆధారంగా చేసుకొని కాంగ్రెస్​ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details