Congress Party Arranged An Iftar Dinner: సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ కమిటీ రిజర్వేషన్లను కల్పించడంతోనే విద్య, ఉద్యోగాలలో ముస్లింలు ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. హైదరాబాద్లోని పాతబస్తీలో కులీకుతుబ్ షా మైదానంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముందుగా ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్, ఎంఐఎం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న నాయకుడు కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందని భ్రమ పడుతున్నారు.. కానీ ఆ స్టీరింగ్ కారులో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గల్లీలో చేరాడని ఎద్దేవా రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న ముస్లింలకు ఎంఐఎం నాయకులు న్యాయం చేయని విషయాన్ని గమనించాలని.. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.