తెలంగాణ

telangana

ETV Bharat / state

'అసంబ్లీ సమావేశాల ముందే రైతు రుణమాఫీ చేపట్టాలి' - FARMER ISSUES

శాసన సభ సమావేశాల ఏర్పాటుకు ముందే అన్నదాతల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్  చేసింది. వెంటనే రుణమాఫీ అమలు చేయాలని అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి కోరారు.

భూ ప్రక్షాళన చేపట్టాకే రైతులు బజారున పడ్డారు : కొదండ రెడ్డి

By

Published : Jul 4, 2019, 5:05 PM IST

రాష్ట్రంలో రైతు రుణ మాఫీ తక్షణమే చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయకముందే రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, అందుకు కాంగ్రెస్‌ కూడా మద్దతిస్తుందని అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ, సచివాలయాల నూతన భవన నిర్మాణాలకు అంత అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి డబ్బులు లేవని చెప్పడంలో ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో రూ.66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయన్న వారు భూ ప్రక్షాళన చేపట్టాక రైతులు బజారున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు రుణ మాఫీ తక్షణమే చేపట్టాలి : కొదండ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details