తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Party Members For Elections 2023 : 60 నియోజక వర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ సభ్యుల జాబితా సిద్ధం..! - తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు

Congress Party Members For Elections 2023 : రాష్ట్రంలో అభ్యర్ధుల ప్రకటనకు.. కాంగ్రెస్‌ సిద్దమవుతోంది. వివాదంలేని, ఒక్కరే పోటీ ఉన్న 60కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పీసీసీ యోచిస్తోంది. ఇప్పటికే ప్రజాబలం ఉండి గెలుపునకు అవకాశం ఉన్న కొందరు నాయకులకు క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని.. రాష్ట్ర నాయకత్వం సూచించగా వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదలకు ముమ్మర కసరత్తు సాగుతోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 9, 2023, 9:51 PM IST

Updated : Aug 9, 2023, 10:16 PM IST

Congress Candidates 60 Constituency : ఎన్నికలకు నన్నద్ధం అవుతున్న కాంగ్రెస్​

Congress Party Members For Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. కర్ణాటకలో అనుసరించిన విధానాన్నే రాష్ట్రంలో అమలు చేయాలని యోచిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఆసక్తి చూపటంతో రెండు, మూడు విడతలుగా నియోజక వర్గాల వారీగా పీసీసీ, ఏఐసీసీ బృందాలు సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సర్వేలు సహా సామాజిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధుల ఎంపిక చేయాలన్న సీనియర్ల సూచనతో ఆ దిశలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటివారంలో తొలి జాబితా విడుదలకు వీలుగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. వివాదం లేని.. ఒకరే పోటీలో ఉన్న 60కిపైగా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాలని పీసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సర్వేల ఆధారంగా కొందరు నాయకులకు.. క్షేత్ర స్థాయిలో పనిచేసుకోవాలని.. రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నియోజకవర్గాలతో పాటు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం రెండు చోట్ల బీసీల నాయకులను బరిలో దించాలని పీసీసీ యోచిస్తోంది.

Congress Leaders For Assembly Elections 2023 : నర్సంపేట నుంచి మాధవరెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, వరంగల్‌ తూర్పు నుంచి కొండాసురేఖ, ములుగు నుంచి సీతక్క.. భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ బరిలో దిగనున్నారు. నల్గొండ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోదాడ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్‌ రెడ్డి, దేవరకొండ- బాలునాయక్‌, ఆలేరు- బీర్ల ఐలయ్యలకు టికెట్లు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వనపర్తి నుంచి చిన్నారెడ్డి, కొల్లాపూర్ నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, షాద్‌నగర్ నుంచి ఈర్లపల్లి శంకర్, గద్వాల్ నుంచి.. సరిత యాదవ్, అలంపూర్ నుంచి సంపత్ కుమార్‌, కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి.. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్‌, గజ్వేల్ నుంచి నర్సారెడ్డిలు బరిలో ఉన్నారు.

Telangana Congress Candidates for Assembly Elections : నిర్మల్ నుంచి శ్రీహరిరావు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌ సాగర్‌రావు.. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, బాన్సువాడ నుంచి బాలరాజ్, జుక్కల్ నుంచి గంగారాం, నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ కుమార్‌ గౌడ్, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బాల్కొండ నుంచి ఆరంజ్‌ సునీల్ రెడ్డి, బోదన్‌ నుంచి సుదర్శన్‌ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. వికారాబాద్‌ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి నందికంటి శ్రీధర్‌ బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), భద్రాచలం నుంచి పొదెంవీరయ్య, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Congress on Assembly Sessions 2023 : అసెంబ్లీలో బీఆర్ఎస్​ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్

60 Candidates Announce Congress Party in TS : కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మంథని నుంచి శ్రీధర్‌బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, హుస్నాబాద్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి, హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్, సిరిసిల్ల నుంచి మహేందర్‌రెడ్డి, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, ధర్మపురి నుంచి లక్ష్మణ్, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నాంపల్లి నుంచి- ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్‌ బరిలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల ద్వారా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో కొందరు నాయకులు నియోజకవర్గాల్లోనే మకాం వేసి జనంలోకి వెళ్తున్నారు. ప్రజాసమస్యలపై జనంలో ఉంటే.. సర్వేల్లో తమ పేరు సిఫార్సు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు.

KC Venugopal on Telangana Assembly Elections : 'భేదాభిప్రాయాలను పక్కన పెట్టేయండి.. కలిసి నడిస్తే ఈసారి మనదే విజయం'

Congress Latest News : కారు స్పీడ్​కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు

Congress Joinings in Telangana : ఆ నలుగురు నేడు కాంగ్రెస్​లో చేరతారు..!

Last Updated : Aug 9, 2023, 10:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details