తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Party joinings in Telangana : కాంగ్రెస్​లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు - హైదరాబాద్ న్యూస్

Congress Party joinings in Telangana : అధికార బీఆర్​ఎస్​లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియాగాంధీ హాజరయ్యే బహిరంగసభలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి తుమ్మల, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావుతో పాటు బీజేపీ బహిష్కృత నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో హస్తం నేతల చర్చల అనంతరం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని కేసీ వేణుగోపాల్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leaders join in Congress party
Telangna Assembly Elections 2023

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 8:07 AM IST

Congress Party joinings పలువురు నేతలు కాంగ్రెస్​లో చేరనున్నారు

Congress Party joinings in Telangana : హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బీఆర్​ఎస్​కి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి సహా పలువురిని బహిరంగ సభ వేదికగా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ల చేరిక ఖరారైనట్లు సమాచారం. మైనంపల్లితో మొదట పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చించారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌ వద్ద తుది నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. వారికి మల్కాజిగిరి, మెదక్‌ అసెంబ్లీ స్థానాలను కేటాయించడానికి కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం.

Tummala Joins Congress: ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ నాయకుల చర్చలు కొనసాగుతున్నాయి. తుమ్మల ఇంటికి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పార్టీలోకి ఆహ్హానించారు. తర్వాత ఖమ్మంలో పొంగులేటి, భట్టి విక్రమార్కలు ఆయన్ని కలిశారు. ఈ చర్చలకు కొనసాగింపుగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.

Congress Screening Committee Meeting : 'అభ్యర్థుల జాబితా ఇప్పుడే తేల్చలేం.. మరోసారి భేటీ అయ్యాక చెబుతాం'

Tummala Latest News :తుమ్మల ఏ నియోజకవర్గం(Tummala Nageswara Rao) నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచే పోటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూకట్‌పల్లి నుంచి తుమ్మల పేరును కొందరు సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులు ఖమ్మం జిల్లా నుంచే ఆయనను పోటీలో దించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మహబూబ్‌నగర్‌లో గతంలో బీజేపీ తరఫున గెలుపొందిన యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ నెల 17నే కాంగ్రెస్‌లో చేరేఅవకాశం ఉంది. కొంతకాలంగా ఈయన కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకొంది. వీరితో పాటు మరికొందరితోనూ కాంగ్రెస్‌ నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది.

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

MP Komati Reddy Venkat Reddy Demand : మరోవైపు.. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy)ని అధిష్ఠానం బుజ్జగించింది. పది రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్‌లు గురువారం తెల్లవారుజామున ఆయన్ని.. కేసీ వేణుగోపాల్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కొంతసేపు మాట్లాడాక.. వేణుగోపాల్, కోమటిరెడ్డిలు ఒకే కారులో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. దారిలో వెంకట్‌రెడ్డి తన ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీని, సీనియర్‌నైన తనకు రాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలో, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీలో,సీడబ్య్లూ స్థానంకల్పించకపోవడాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. తనకంటే జూనియర్‌లు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశమిచ్చారని వాపోయినట్లు సమాచారం. కొందరికి కీలకమైన రెండేసి స్థానాల్లో చోటు కల్పించడాన్నీ ప్రశ్నించినట్లు తెలిసింది. తన ఆవేదన అర్థం చేసుకోగలనన్న వేణుగోపాల్.. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ పక్కనపెట్టలేదని.. తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే​ అభ్యర్థుల తొలి జాబితా!

Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details