తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad By Election: అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమంలో కాంగ్రెస్‌ - Telangana congress news

హుజూరాబాద్​ ఉపఎన్నిక (Huzurabad By Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్​కు టికెట్ ఖరారు కావడం వల్ల పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.

Huzurabad By Election
హుజూరాబాద్​ ఉపఎన్నిక

By

Published : Oct 5, 2021, 10:08 PM IST

హూజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election)లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టింది. స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్‌.. చివరి క్షణంలో స్థానికేతరుడైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ (NSUI State President Balmoori venkat)ను బరిలో నిలిపింది. ఫలితంగా టికెట్​ ఆశించిన స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకుల్లో ఎక్కువ మంది నామినేషన్లు కూడా వేశారు.

ఈ నేపథ్యంలో వారందరిని ఉపసంహరించుకునేట్లు బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ చేపట్టింది. అందులో భాగంగా వారందరిని ఇవాళ గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు పిలిపించారు. పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు వారితో సమావేశమై సంప్రదింపులు జరిపారు.

గాంధీభవన్​లో సమావేశమైన నేతలు

ఈ నెల 8న బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ వేసే సమయానికి అసంతృప్తులను బుజ్జగించి.. ఆరోజు అందరూ కలిసి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేట్లు చర్చలు జరిపినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

సత్తా చాటడమే లక్ష్యంగా...

హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election)లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీ ఈసారైనా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ఎన్నికల్లో (Huzurabad By Election) హుజూరాబాద్‌లో 61 వేల ఓట్లకు పైగా సాధించి రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నిక ప్రధాన సవాల్‌గా మారింది. 2004 నుంచి వరుసగా ఓడుతున్నా.. ద్వితీయ స్థానంలో ఉంటూ వస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరడంతో పాటు నియోజకవర్గంలోని మండలస్థాయి ముఖ్యనేతల్లో పలువురు తెరాస, భాజపాల్లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ స్థానికంగా నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది.

అభ్యర్థి (Huzurabad By Election)ని ఖరారు చేయడంలోనే కాంగ్రెస్‌ తీవ్ర జాప్యం చేసింది. స్థానిక నేతలను బరిలో దింపాలా? బయటి వారిని పోటీ చేయించాలా? అనే సందిగ్ధత కొన్నాళ్లు కొనసాగింది. చివరకు ఎన్​ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరి (Huzurabad By Election)లో దింపింది. ఎలాంటి సామాజిక సమీకరణలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేతలైన మాజీమంత్రి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా బల్మూరి వెంకట్‌ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపడంతో పీసీసీ ఆమోద ముద్ర వేసింది. ఆయన నామినేషన్‌ దాఖలు అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి ముఖ్యనేతలతో పాటు జిల్లా నేతలు ప్రచారం (Huzurabad By Election)లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details