టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ పార్టీ శ్రేణులు నిరుపేదలను ఆదుకునేందుకు చురుకుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐవైసీ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, తదితరులు కలిసి పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు - Congress_Party_Distributed essentials to poor at himayatnagar
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కార్మికులకు కాంగ్రెస్ శ్రేణులు నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్డౌన్ వల్ల పేదలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో తమ వంతు సాయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ కార్మికులకు బియ్యం, పప్పు, కూరగాయలను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందిస్తున్నట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
ఇవీ చూడండి:సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్'