అన్ని రకాల రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'ఇంటిగ్రేటెడ్ హెల్ప్ డెస్క్' ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిదీ తనకు తెలుసు అనే వైఖరిని విడనాడాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో కేసులు పెరిగాయని, కరోనా లక్షణాలు ఉన్న రోగులను చేర్చుకోడానికి కొన్ని ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని ఆరోపించారు.
'ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి' - కాంగ్రెస్ డిమాండ్స్
కేసీఆర్ మొండి వైఖరిని విడనాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అన్ని రకాల రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించింది. వైరస్ నిర్ధరణ కోసం ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన ప్రయోగశాలకు నమూనాలు పంపేలా ప్రైవేటు ఆస్పత్రులకు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

'ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి'
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు దిశనిర్దేశం చేయడానికి సీనియర్ వైద్యుల నేతృత్వంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరీక్ష కోసం ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన ప్రయోగశాలకు నమూనాలు పంపించేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు అధికారం ఇవ్వాలని... దీనివల్ల సమయం ఆదా కావడంతోపాటు గాంధీ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
ఇవీ చూడండి:రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్.. కర్నల్ కుటుంబానికి పరామర్శ