తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్ - Congress on Ghmc elections

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్థులు, డివిజన్ పార్టీ ఇంఛార్జిలు, అసెంబ్లీ ఇంఛార్జిలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమం వేగవంతమైంది. అభ్యర్థుల తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

గ్రేటర్​ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్
గ్రేటర్​ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్

By

Published : Nov 24, 2020, 4:29 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాలకుగాను 146 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలిపింది. మరో నాలుగు స్థానాలలో అభ్యర్థులను నిలపలేకపోయింది. తలాబ్ చంచలం, బార్కాస్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. మిగిలిన 146 డివిజన్లలో పార్టీ అభ్యర్థులతో పాటు డివిజన్, అసెంబ్లీ పార్లమెంట్ ఇంఛార్జిలు ముఖ్య నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు.

దీటుగా ప్రచారం...

తెరాస, ఎంఐఎం, భాజపాకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక పరమైన హామీల జోలికి వెళ్లకుండా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్​లో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ తమకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరుతున్నారు. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయడం వల్ల భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

విస్తృతంగా...

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తమ్​, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు. తెరాస, భాజపాలపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూ... కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు.…

విమర్శలు...

ఎంపీ రేవంత్ రెడ్డి... కాప్రా, ఏఎస్​రావు నగర్, మౌలాలి, మల్కాజిగిరి, గౌతంనగర్ డివిజన్​లలో రోడ్ షో నిర్వహించారు. భాజపా నాయకులు సందట్లో సడేమియాలా తయారయ్యారని, హిందూ, ముస్లింలు కలిసి మెలిసి బతుకుతుంటే చిచ్చు పెట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించిన రేవంత్... పేదలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు.

ఇవీచూడండి:కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య

ABOUT THE AUTHOR

...view details