తెలంగాణ

telangana

ETV Bharat / state

'రిజిస్ట్రేషన్ల విషయంలో జాప్యం ఎందుకు' - గూడురు నారయణరెడ్డి ఫైర్

కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పునరుద్ధరించేందుకు ఎందుకు ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సామాన్య ప్రజలపై రుద్దడం ఏమిటని నిలదీసింది.

'రిజిస్ట్రేషన్ల విషయంలో జాప్యం ఎందుకు'
'రిజిస్ట్రేషన్ల విషయంలో జాప్యం ఎందుకు'

By

Published : Sep 28, 2020, 11:10 AM IST

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ల పునరుద్ధరణ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పునరుద్ధరించేందుకు ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించింది. ముందస్తు ప్రణాళిక లేకుండా కొత్త చట్టాలను తీసుకురావడంలో ప్రధాని మోదీని కేసీఆర్‌ మించిపోతున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కొత్త రెవెన్యూ చట్టం అవసరమా? లేదా? అని చర్చ జరుగుతున్న సమయంలో సరైన కార్యాచరణ లేకుండా చట్టం తేవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

20 రోజులుగా ఆగిన రిజిస్ట్రేషన్లు దసరా వరకు మరో నెల రోజులు వేచి ఉండాలని సీఎం కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సామాన్య ప్రజలపై రుద్దడం ఏమిటని ప్రశ్నించిన ఆయన రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్లు మినహా మరే ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని ద్వజమెత్తారు. నోట్టు రద్దు, జీఎస్టీ, లాక్ డౌన్, తాజాగా కొత్త వ్యవసాయ బిల్లులు వరకు వేటిని కూడా ప్రణాళికలు లేకుండానే కేంద్రం అమలు చేసిందని ఆరోపించారు.

ఇదీ చూడండి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో.. సమయం తినే ప్రశ్నలే అధికం!

ABOUT THE AUTHOR

...view details