తీవ్రంగా విజృంభిస్తూ... ప్రజల ప్రాణాలు తీస్తున్న కరోనా వ్యాప్తి గురించి పక్కన పెట్టి ప్రాధాన్యతలేని అంశాలపై సీఎం సమీక్ష చేయడం ఏమిటని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ప్రశ్నించారు. కరోనా నివారణలో విఫలమై... కాంగ్రెస్ పార్టీని నిందించడం... తెరాస నాయకులకు, ఆరోగ్య శాఖ మంత్రికి సరికాదన్నారు.
'కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించాలి' - కరోనా వార్తలు
సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లు కరోనాను రాజకీయం చేయడం మానుకోవాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి హితవు పలికారు. ప్రతిపక్షాల విమర్శలను తప్పించుకోడానికి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే... రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించాలి'
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కరోనా వైరస్ వ్యాప్తి విజృంభనపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పడకలకు కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన మాటలు నిజమైతే... ఇప్పటికీ ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోడానికి ఎందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రశ్నించారు.