తాను పార్టీ మారుతానని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఖండించారు. కొంతమంది కేవలం వ్యాపార ధోరణితోనే తమ పేర్లు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకనవుతానని ఎన్నుకున్న మల్కాజిగిరి ప్రజల ఆశలను నిజం చేస్తానని అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనపై ఇలాంటి వార్తలే వస్తున్నాయని... అవి అవాస్తవాలని తెలిపారు.
నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే! - మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి
తనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను ఖండించారు.
రేవంత్రెడ్డి
Last Updated : May 28, 2019, 3:03 PM IST