Congress MPs Met Rahul Gandhi: ఏఐసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ కలిశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై బయటకు వెళుతున్న సందర్భంలో గేట్ నంబర్ వన్ వద్ద రాహుల్‌ను నేతలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో రాహుల్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
రాహుల్‌తో ముచ్చటించిన ఉత్తమ్, కోమటిరెడ్డి
Congress MPs Met Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ కలిశారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం రాహుల్‌ను ఎంపీలు కలిసి కాసేపు ముచ్చటించారు.
Congress
చర్చలో భాగంగా సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు రాష్ట్ర సీనియర్ నేతలకు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్ అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. వాటికి సంబంధించిన వివరాలను అందించాలని, ఆ అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్