Uttam Kumar Reddy on Bharat Jodo Yatra: ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన గెలుపు కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కొనియడారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసే సమయంలో.... అనేక వర్గాలతో రాహుల్ కలుస్తారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
'నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న రాహుల్‌గాంధీ జోడోయాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ జోడోయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి కార్యక్రమం మరోసారి మనం చూడలేం. గాంధీ జోడో యాత్ర తెలంగాణలో చరిత్ర సృష్టిస్తుంది. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. తెలంగాణలో ప్రతిసమస్యపై రాహుల్‌గాంధీ చర్చిస్తారు.'-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ