తెలంగాణ

telangana

ETV Bharat / state

Uttam On KCR Comments: ఇవీ చాలా సిల్లీ కామెంట్స్​: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - CM KCR Comments on floods

Uttam On KCR Comments: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

Uttam On CM KCR Comments
Uttam On CM KCR Comments

By

Published : Jul 17, 2022, 5:07 PM IST

Uttam On KCR Comments: క్లౌడ్‌ బరస్ట్‌ వల్లే రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. క్లౌడ్ బరస్ట్ వల్లే వరదలు వచ్చాయనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

క్లౌడ్ బరస్ట్ వల్లే వరదలని సీఎం అనడాన్ని ఖండిస్తున్నా. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనడంలో అర్థం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదు. ఇది చిన్న ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజల దృష్టిమళ్లించాలని సీఎం కేసీఆర్ చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మునిగిపోయింది.- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనేది సిల్లీగా అభివర్ణించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరి కాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించాలని సీఎం కేసీఆర్‌ చూశారని విమర్శించారు. ఇలాంటివి చిన్న ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతాయని ఆయన వెల్లడించారు.

కాళేశ్వరం లోపభూయిష్టమైన ప్రాజెక్టు: పొన్నాల

సీఎం కేసీఆర్‌ మత్తు వీడి నిద్ర నుంచి బయటకు వచ్చారని.. వరద ప్రభావిత ప్రాంతాలు చూడడానికి వెళ్లారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ వెళ్తున్నారని తెలిశాక పరువు పోతుందనే సీఎం వెళ్లారని ధ్వజమెత్తారు. ఓ వైపు గవర్నర్‌.. మరోవైపు సీఎం వెళ్లారని చెప్పారు. కాళేశ్వరం మానవ తప్పిదం కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోనే పెద్ద ఇంజినీర్‌ అని చెప్పుకునే కేసీఆర్‌ మాట్లాడడానికి ఎందుకు జంకుతున్నారని పొన్నాల నిలదీశారు. కాళేశ్వరం లోపభూయిష్టమైన ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరం వద్ద 12లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నప్పుడే పంప్‌హౌస్‌లు మునుగుతాయా? అని ఆక్షేపించారు. ఎల్లంపల్లి నుంచి వచ్చి అతి ఎక్కువ వరదనీటిని పోచమ్మసాగర్‌కు తీసుకురావచ్చని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 35లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారని.. ఇక ఎకరాకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో లక్షల కోట్లు ఎలా ఖర్చుపెట్టారని నిలదీశారు. ఈ విషయంలో చర్చకు రావాలని పొన్నాల డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి

ఇవీ చదవండి:'భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర'.. సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

నదిలో 53కేజీల వెండి శివలింగం.. గ్రామస్థుల పూజలు.. పోలీస్ స్టేషన్​లో దర్శనాలు!

ABOUT THE AUTHOR

...view details