తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2019, 11:19 PM IST

ETV Bharat / state

టీఆర్​టీపై సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ

​దిల్లీ పర్యటనలు, ఉప ఎన్నికలపై చూపిస్తున్న శ్రద్ధ టీఆర్​టీ అభ్యర్థుల ఉద్యోగ నియామక ఉత్తర్వులపై లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. టీఆర్టీ ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడిచినా.. అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

రేవంత్‌ రెడ్డి

టీఆర్​టీ ఫలితాలు వెల్లడై రెండేళ్లు గడిచినా.. అర్హత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాను సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ మార్గంలో వెళ్తుండగా నిరసన తెలుపుతున్న వందల మంది యువతను గమనించినట్లు తెలిపారు. సొంత ఇంటి పంచాయితీ పరిష్కారం కోసం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్​కు కేబినెట్‌లో స్థానం కల్పించారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పదవుల పందేరం విషయంలో ఆగమేగాలపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ నిరుద్యోగ బిడ్డల సమస్యల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details