తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2020, 4:13 PM IST

Updated : Jun 7, 2020, 6:04 PM IST

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్​కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం మోపడం తగదంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.

Hyderabad latest news
Hyderabad latest news

విద్యుత్తు ఛార్జీల మదింపులో పేద, మధ్య తరగతి జేబులకు చిల్లు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కించడం వల్ల శ్లాబులు మారిపోతున్నాయన్నారు. ఇందువల్ల వినియోగదారులపై రెండు, మూడింతలు అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా నేపథ్యంలో ఉపాధి పోయి, కుటుంబ పోషనే కష్టమైన పేద, మధ్య తరగతికి కరెంట్ బిలులు షాక్ ఇస్తున్నాయని ఆరోపించారు. వంద యూనిట్ల వినియోగదారుడు తాజా మదింపు కారణంగా 300 యూనిట్ల శ్లాబులోకి వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఒక్కో వినియోగదారుడి పై రూ.1500 నుంచి రూ.2000 వరకు అదనపు భారం పడుతోందని ఆరోపించిన ఆయన... బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తే వడ్డీతో సహా వసూలు చేస్తామనడం దారుణమని వ్యాఖ్యానించారు.

అడ్వాన్స్ ఛార్జీలు చెల్లించిన వినియోగదారులకు వడ్డీ చెల్లిస్తారా అని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా ఉపేక్షించేది లేదన్నారు. తెరాస సర్కారు తక్షణమే మూడు నెలల విద్యుత్తు ఛార్జీల మదింపు నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని రేవంత్​ రెడ్డి హెచ్చరించారు.

Last Updated : Jun 7, 2020, 6:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details