తెలంగాణ

telangana

ETV Bharat / state

రెమ్​డెసివిర్​ కొరతపై సీఎంవో, కేటీఆర్​, సీఎస్​లకు రేవంత్​ ట్వీట్​

రెమ్​డెసివిర్​ ఇంజక్షన్ల కొరతపై సీఎంవో, మంత్రి కేటీఆర్​, సీఎస్​లకు ఎంపీ రేవంత్​ రెడ్డి ట్వీట్​ చేశారు. మంత్రి కేటీఆర్ త‌క్షణం స్పందించి క‌రోనా రోగుల‌కు రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అందించాల‌ని ఆయన కోరారు.

congress mp revanth reddy tweet
రెమ్​డెసివిర్​ కొరతపై సీఎంవో, కేటీఆర్​, సీఎస్​లకు రేవంత్​ ట్వీట్​

By

Published : May 15, 2021, 3:44 AM IST

రాష్ట్రంలో రెమ్​డెసివిర్ ఇంజక్షన్ల కొరతపై తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్‌, సీఎస్ సోమేష్‌కుమార్‌లకు ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌లు ఆస్పత్రుల్లో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో లేవంటూ క‌రోనా రోగులు త‌మ దృష్టికి తేస్తున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇంజక్షన్ల కొర‌త‌పై మంత్రి కేటీఆర్‌, సీఎస్ సోమేష్‌కుమార్ మాట‌ల్లో కాకుండా..చేత‌ల్లో చూపించాల‌ని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ త‌క్షణం స్పందించి క‌రోనా రోగుల‌కు రెమ్​డెసివిర్​ అందించాల‌ని ఆయన కోరారు.

ఇదీ చదవండి: నేడు, రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details