సార్సాల ఘటనను పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు దాడి చేశారని చెప్పారు. వందేళ్ల క్రితం కొమురం భీం ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ సమస్యలు తీరలేదని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేదని పేర్కొన్నారు. శాంతి భద్రతలు అదుపుతప్పాయని తెలిపారు. భద్రాచలం దాడి ఘటననూ ప్రస్తావించారు. 5 లక్షల హెక్టార్లలో ఈ సమస్య ఉందని... గిరిజనులను అడవుల నుంచి పంపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ సమస్యపై గవర్నర్ సమీక్షించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్సభలో రేవంత్ - koneru krishna rao
సార్సాలలో అటవీ అధికారిణిపై దాడి ఘటనను పార్లమెంట్లో లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గిరిజనులను అడవుల నుంచి పంపించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Revant Reddy
అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్సభలో రేవంత్
ఇదీ చూడండి: కాంగ్రెస్కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్