Congress MP Komatireddy Venkat Reddy Fires on KCR :రాష్ట్రంలో 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా సైతం పోటీ చేయనంటూ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్(BRS) నేతలకు తెలుసని.. అందుకే దీనిపై రాష్ట్ర మంత్రులకు సైతం భయం పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రమంతటా కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పది నుంచి పన్నెండు గంటల వరకు విద్యుత్ ఎక్కడా ఉండటం లేదు. రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నా లేనట్లే.. ఆయనకు సబ్జెక్టు లేదు. దానిపై అవగాహన లేదు. రాష్ట్ర సమస్యలపై కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు సమీక్ష చేయడం లేదు. చాలా వరకు వరి పంట కోతకు వచ్చే సమయంలో.. కరెంట్ లేక నీరు రాక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. :-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
MP Komatireddy Counter to KCR : '50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?'
Komatireddy on BRS Government :నీళ్లు, నిధులు, నియామకాలు.. అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ వాగ్ధానాలనే గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పనలో తీవ్ర విఫలం చెందిందన్నారు. గ్రూప్ పరీక్షలను నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ పూర్తి వైఫల్యం చెందిందనీ.. పరీక్ష నిర్వహణ చేత కావడం లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Election) తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.