ఎల్ఆర్ఎస్ నిబంధనలను కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లతో కలిపి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని.. వాటిని కొట్టివేయాలని కోమటిరెడ్డి పిల్ దాఖలు చేశారు.
ఎల్ఆర్ఎస్పై ఎంపీ కోమటిరెడ్డి వేసిన పిటిషన్ విచారణ అప్పుడే! - New Revenue Act in Telangana
ఎల్ఆర్ఎస్ నిబంధనలను కొట్టివేయాలన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని.. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లతో కలిపి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
![ఎల్ఆర్ఎస్పై ఎంపీ కోమటిరెడ్డి వేసిన పిటిషన్ విచారణ అప్పుడే! MP komatireddy petition in High court On LRS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8936143-447-8936143-1601034802720.jpg)
ఎల్ఆర్ఎస్పై ఎంపీ కోమటిరెడ్డి పిటిషన్
అధికారులు చేసిన తప్పులకు ప్రజలు భారీగా జరిమానా చెల్లించేలా నిబంధనలు ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. మిగతా పిటిషన్లతో జతపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.