కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం కేసీఆర్ చెప్పటం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy on kcr) మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి కేసీఆర్(MP fire on kcr) తప్పించుకోవాలని చూస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. దిల్లీ జంతర్‌మంతర్‌లో దీక్ష చేసేందుకు కేసీఆర్ సిద్ధమా?(komatireddy challenge to kcr) అని ఎంపీ సవాల్ విసిరారు.
MP komatireddy:కేసీఆర్ రాజీనామా చేస్తే మేము కేంద్రంతో పోరాడతాం: కోమటిరెడ్డి
MP komatireddy on kcr :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను నిండా ముంచుతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం కేసీఆర్ చెప్పటం దారుణమన్నారు. దిల్లీలో జంతర్‌మంతర్‌లో దీక్షకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy on paddy) విమర్శించారు. కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించలేవా? అని సీఎంను ప్రశ్నించారు. కేసీఆర్ కేంద్రంపై ఎందుకు పోరాటం చేయట్లేదని ఎంపీ కోమటిరెడ్డి నిలదీశారు. ఉత్తరాది రైతుల్లాగా పోరాటం చేద్దామని ఆయన అన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే మేము కేంద్రంతో పోరాడతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.