MP Komati reddy on KCR: రైతుల నుంచి ధాన్యం సేకరించడంలో మొదటి దోషి తెరాస అయితే, రెండో దోషి భాజపా అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు రెండు నెలలుగా ఖరీఫ్ పంట ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పనికిరాని ప్రాజెక్టులు నిర్మించి కమిషన్ తీసుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రైతుల వద్ద ఉన్న 70 శాతాన్ని ధాన్యాన్ని సీఎం కేసీఆర్ కొనుగోలు చేయకుండా యాసంగి పంట కోసం పోరాటం చేస్తున్నారని విమర్శించారు.
వ్యాట్ తగ్గించాలి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Komati reddy on tsrtc charges: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడాన్ని ఎంపీ కోమటిరెడ్డి ఖండించారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ... ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.
భద్రాచలం రోడ్డుకు టెండర్లు
Komati reddy on roads: హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డు గురించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. రెండు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా అదేశాలిస్తామని కేంద్రమంత్రి అన్నారని పేర్కొన్నారు. భువనగిరి పరిధిలో 120 కి.మీ రోడ్డు నిర్మాణ పనులు ఉన్నాయన్నారు. రెండు రాజధానుల మధ్య ట్రాఫిక్ పెరిగినందువల్ల హైదరాబాద్-భద్రాచలం రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం ఆదా అవుతుందని ఎంపీ తెలిపారు. త్వరగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారని కోమటిరెడ్డి వెల్లడించారు.
ఖరీఫ్‌లో పండిన ధాన్యం అమ్ముకోలేక.. వర్షాలకు తడిసినా కూడా ప్రభుత్వం కొనడం లేదు. ఈ పంట కొనకుండానే యాసంగిపై పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చాలా రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ తగ్గించాయి. దిల్లీలో ఎనిమిది రూపాయలు తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నరు. ధాన్యం కొనుగోళ్లు, హుజూరాబాద్ ఓటమిని డైవర్ట్ చేయడానికి నాటకం ఆడుతున్నరు. ఇందులో మొదటి దోషి కేసీఆర్ అయితే.. రెండో దోషి భాజపా. కేసీఆర్‌కు త్వరలోనే బుద్ధి చెప్పే టైం వస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అవసరంలేని ప్రాజెక్టులు కట్టి కోట్లు దండుకున్నారు. భద్రాచలం రోడ్డుపై కేంద్రమంత్రి గడ్కరీని కలవడం జరిగింది. దీనిపై మంత్రి సానూకులంగా స్పందించి టెండర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ