తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: మున్సిపాలిటీల్లో 'హస్త'వాసి పనిచేసేనా..? - మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలు​

మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లుతోంది. ఆశావహుల పోటీ తీవ్రంగా ఉన్న మున్సిపాలిటీల్లో..కార్పొరేషన్లల్లో ఇద్దరు, ముగ్గురి చేత నామినేషన్ల వేయిస్తోంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులు బరిలో ఉండేట్లు పీసీసీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు... ఓటర్లను ఆకట్టుకునే మున్సిపల్ ఎన్నికల ప్రణాళికపైనా హస్తం నేతలు దృష్టిసారించారు.

CONGRESS MORE FOCUS ON CANDIDATES IN MUNICIPALITY ELECTIONS
మున్సిపాలిటీల్లో 'హస్త'వాసి చూపెట్టేందుకు అన్నిరకాల సిద్ధమైన కాంగ్రెస్​....

By

Published : Jan 10, 2020, 1:46 PM IST

Updated : Jan 10, 2020, 2:56 PM IST

మున్సిపాలిటీల్లో 'హస్త'వాసి చూపెట్టేందుకు అన్నిరకాల సిద్ధమైన కాంగ్రెస్​....

పుర ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. డీసీసీ అధ్యక్షులకే అభ్యర్ధుల ఎంపిక బాధ్యత పీసీసీ అప్పగించడంతో టికెట్‌ కోసం రాష్ట్ర స్థాయి నాయకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. స్థానికంగా ఏవైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మాత్రమే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని, పీసీసీని, ఇతర నేతలను సంప్రదిస్తున్నారు. లేకుంటే అక్కడనే తుదినిర్ణయం తీసుకుని నామినేషన్ల దాఖలు సిద్దమవుతున్నారు.

ఇద్దరు, ముగ్గురితో నామినేషన్లు

కీలకమైన స్థానాల్లో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి... ఎక్కడ పోటీ నుంచి తప్పుకుంటారోనన్న అనుమానాలు ఉన్నచోట్ల... ఎక్కువ మందిని బరిలో దించేందుకు చొరవ చూపుతున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు అంతకంటే ఎక్కువ మందిని బరిలో దించుతున్నారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం..నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేకపోయినా... అధికార పార్టీకి అమ్ముడుపోయినా తక్షణమే ఆ స్థానంలో మరొకరిని బరిలో దించేందుకు వీలుగా ఇద్దరు లేక ముగ్గురి చేత నామినేషన్లు వేయిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్నచోట...వారి మధ్య విబేధాలు తలెత్తకుండా..సర్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అభ్యర్ధులకు ఈ నెల 11,12 తేదీల్లో బీ ఫారాలను అందచేయాలని పీసీసీ నిర్ణయించడంతో ఆ మేరకు గాంధీభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉచితంగా 150గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 9లక్షలు

మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిద్ధమవుతున్న టీపీసీసీ...ఓటర్లను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందిస్తోంది. మాకంరెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ...ముసాయిదాను సిద్ధం చేసింది. అర్హులకు 150 చదరపు గజాల ఉచిత స్థలం ఇవ్వడం సహా గృహ నిర్మాణానికి 9 లక్షలు గ్రాంట్‌ మంజూరు చేయాలని సూచించింది. 750 చదరపు గజాలలోపు ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, ప్రతి మున్సిపాలిటీలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, స్వయం సహాయక సంఘానికి 25 లక్షలు రుణం ఇవ్వాలని ప్రతిపాదించింది. విద్యార్ధులకు ఉచిత రవాణా సహా 18 కీలక అంశాలు మ్యానిఫెస్టో ముసాయిదాలో ఉన్నాయి. పీసీసీలో విస్తతంగా సమాలోచనలు జరిపిన తర్వాత...అధిష్ఠానం అనుమతితో పురపోరు మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించనుంది.

Last Updated : Jan 10, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details