శంషాబాద్ ఘటనకు మానవ సమాజమంతా బాధ్యులేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మద్యం అమ్మకాలతో సమాజం ఈ విధంగా దిగజారుతోందని...అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మద్యం మత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడిన మానవ మృగాలకు ఉరితీయడమే సరైందని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలను అదుపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల విచారణ జాప్యం జరిగిందని ఆరోపించారు. సమయానికి పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ఇంత జరిగినా సీఎం స్పందించకపోవడంపై జీవన్ మండిపడ్డారు.
ఇలాంటి మానవ మృగాలను ఉరి తీయాలి: జీవన్‌రెడ్డి - shamshabad murder case
రాష్ట్రంలో సంచలనం రేపిన శంషాబాద్ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు మానవ సమాజమంతా బాధ్యులేనని అన్నారు. మద్యం అమ్మకాలతో సమాజం ఈ విధంగా దిగజారుతోందని... ఇలాంటి మానవ మృగాలను ఉరితీయడమే సరైందన్నారు.
ఇలాంటి మానవమృగాలను ఉరితీయాలి: జీవన్‌రెడ్డి