ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వ్యవసాయ విధానాల్లో ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ ఇంకా అమలు కాలేదని ఆయన అన్నారు. గతంలో రైతుబంధు ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని... ఇప్పుడు 5 ఎకరాల వరకు భూమి ఉన్నవారికే ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇంకా లక్షలాది మంది రైతులకు పాసు పుస్తకాలు అందలేదని తెలిపారు. వ్యవసాయంతోపాటు పండ్ల తోటల పెంపకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖలో ఏముందంటే? - telangana government
వ్యవసాయ విధానాల్లో సర్కారు లోపభూయిష్టంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
బిందు సేద్యానికి కేంద్రం ఇచ్చే సబ్సిడీని వాడుకునే పరిస్థితి లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించడం లేదన్నారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10 కిలోల కోతతో రైతులు నష్టపోయారని ఆయన ఆరోపించారు. పంటసాగుపైన దేశంలో ఎక్కడా ఆంక్షలు లేవని.. ఇక్కడే నియంతృత్వ వ్యవసాయం సాగు ఉందని చెప్పారు. ఇది కేవలం రైస్ మిల్లర్లకు రైతాంగాన్ని తాకట్టు పెట్టడమేనని.. సన్నబియ్యం పంటలతో దిగుబడి తగ్గి, పంటకాలం పెరిగి రైతులకు నష్టం వస్తుందన్నారు. అందువల్ల సన్నరకం వరికి క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలను రాజకీయ కోణంలో చూస్తోంది'