తెరాస ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపై నిర్ణయం తీసుకోడానికి రెండేళ్ల సమయం పట్టిందని వెల్లడించారు. మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ అంత కంటే మెరుగని చెప్పి కాలయాపన చేశారని విమర్శించారు.
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్-ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యం చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల ఫలితాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయడం లేదని, చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.