రాష్ట్రప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని మండిపడ్డారు.
'జగన్‌తో కేసీఆర్ లాలూచీ.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు' - Rayalaseema Upliftment Scheme is the latest news
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని విమర్శించారు.
'రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ సీఎంకు కేసీఆర్ తాకట్టు పెట్టారు'
కమీషన్ల కోసమే కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 450 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపేలా జగన్‌పై కేసీఆర్ ఒత్తిడి తేవాలని సూచించారు.