తెలంగాణ

telangana

ETV Bharat / state

Jeevan Reddy on millers: రైతులను మిల్లర్లు దోచేస్తున్నారు.. నా వద్ద ఆధారాలున్నాయి: జీవన్ రెడ్డి

Jeevan Reddy on Paddy: రాష్ట్రంలో రైతులను మిల్లర్లు దోచేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. క్వింటాలుకు 5 కిలోలు చొప్పున 600 కోట్ల నిలువు దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. మిల్లర్ల దోపిడీలో తెరాసకు వాటా లేదనుకుంటే రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Jeevan Reddy on Paddy
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

By

Published : Dec 23, 2021, 10:28 PM IST

Jeevan Reddy on Paddy: రాష్ట్రంలో సేకరిస్తున్న 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోచేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. క్వింటాలుకు 5 కిలోలు తీసినా 600 కోట్ల రూపాయల నిలువు దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ విషయమై తాను ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.

కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం

mlc jeevan reddy on govt: వరికి కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్రాన్నే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్పష్టత ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతోందన్నారు.

జగిత్యాలలోనే 100 కోట్లు

jeevan fire on millers: ఒక్క జగిత్యాల జిల్లాలోనే 5 లక్షల క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేసి మిల్లర్లు 100 కోట్ల రూపాయలు దండుకున్నారని జీవన్​ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులు ఆగమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి రెండు వేల కోట్లు, మొక్కజొన్నపై మరో వెయ్యి కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందని ద్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర ప్రకటించి.. కేంద్రంపై యుద్ధం చేస్తే తాము కూడా తెరాస వెంట ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు రూపాయలు వస్తాయని.. ఇందులో 10 శాతం 3 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేయలేవా అని ప్రశ్నిచారు. మిల్లర్ల దోపిడీలో తెరాస వాటా లేదనుకుంటే రైతులకు న్యాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి. వరికి కనీస మద్దతు ధర కల్పించడం మాకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం విధానాలనే అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాలు ఉండవంటోంది. ఖరీఫ్ ధాన్యం సేకరణ టైం ఇప్పటికే ముగిసిపోతోంది. ఇవాళ ఒకవైపు నాణ్యత ప్రమాణాల పేరుతో మిల్లర్లు దోపీడీ చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చేసుకోట్లేదు. ప్రతి 40 కిలోలకు 3 నుంచి 5 కిలోల వరకు అధికంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి నా వద్ద రికార్డెడ్​ ఎవిడెన్స్ ఉంది. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తూకం వేయాలి. మిల్లులో ధర్మకాంటాపై మనకు రికార్డ్ వస్తది. అది తీసుకోకుండా మరల ఇంకో స్లిప్​ ఇస్తున్నారు. ప్రతి లారీ లోడుకు 20 క్వింటాళ్లకు పైగా దోపీడీ జరుగుతోంది. మన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ధాన్యం సేకరించామని చెప్పారు. అందులో ఐదుశాతం ధాన్యాన్ని మిల్లర్లు దోచుకున్నారు. 3 లక్షల మెట్రిక్​ టన్నులు దోచేశారు. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు రైతుల నుంచి దోచుకున్నారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిని ప్రూవ్​ చేస్తా.' - జీవన్​ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details