Mlc Jeevanreddy On Employees: ఉద్యోగుల విభజన ప్రక్రియ స్థానికత ఆధారంగానే చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
jeevan reddy on GO: ఈ విషయంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన జోన్, జిల్లాల వారిగా ఉద్యోగుల కేటాయింపు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలనే అంశాన్ని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడిందని.. అక్కడే ఉద్యోగం చేస్తున్న వారిని ఇంకో జిల్లాకు కేటాయించారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత కూడా మారుతుందన్నారు. ఈ పరిస్థితిలో నిరుద్యోగ యువతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. జూనియర్ ఉద్యోగుల కేటాయింపు జరిగిన జిల్లాలో కొత్త ఉద్యోగాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు.