కొవిడ్ రోగులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కిట్లు లేవని కరోనా నిర్ధరణ పరీక్షలను కావాలనే తగ్గిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: జీవన్ రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వైద్యరంగాన్ని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వంపై జీవన్‌రెడ్డి విమర్శలు
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కూడా పనిచేయకపోతే ప్రజలు ఎక్కడికెళ్లాలని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్ వాక్సిన్ ఎందుకివ్వడం లేదన్నారు. టీకాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు దొందు దొందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు పూర్తిగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.