మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరతారని తాను ఊహించలేదని, ఆయన భాజపాలో చేరతానని తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(mlc jeevan reddy) ఆరోపించారు. ఈటల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్లయితే 50వేల మెజారిటీతో గెలుపొందేవారని, ఇప్పుడు గెలుపు ఎవరిది అన్నది చెప్పలేనని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమానంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కీలకమైన వ్యక్తి ఈటల అని కొనియాడారు. ఈటల ఏ పార్టీలో చేరినా తన వ్యక్తిత్వాన్ని కోల్పోతారని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలా.. వద్దా అన్న ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు.
ఈటల భాజపాలో చేరతారని ఊహించలేదు: జీవన్ రెడ్డి - telangana varthalu
ఈటల రాజేందర్ భాజపాలో చేరాలనే నిర్ణయం సరైనదికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(mlc jeevan reddy) వ్యాఖ్యానించారు. భాజపాలో చేరితే ఈటల బలహీనపడతారన్న జీవన్‌రెడ్డి.. కేసీఆర్‌తో సమానంగా తెలంగాణ ఉద్యమంలో ఈటల భాగస్వామి అని పేర్కొన్నారు.
![ఈటల భాజపాలో చేరతారని ఊహించలేదు: జీవన్ రెడ్డి mlc jeevan reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12060657-135-12060657-1623152251033.jpg)
ఈటల భాజపాలో చేరతారని ఊహించలేదు: జీవన్ రెడ్డి
తాను ఏ రాజకీయ పార్టీని తప్పు పట్టడం లేదని జీవన్ రెడ్డి(jeevan reddy) స్పష్టం చేశారు. తెరాస అవినీతికి భాజపా రక్షణగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. తెరాస అవినీతి చేస్తోందని.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అంటున్నారని విమర్శించారు. ఎప్పుడు జైల్లో పెడతారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల