కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేకుండా రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నారన్నారు. కనీస మద్దతు ధరకు కల్పించేలా చట్టంలో సవరణలు తేవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని ఆయన గుర్తుచేశారు.
కనీస మద్దతు ధర అమలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిది కాదని ప్రకటించడాన్ని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిల్లర్లకు లబ్ది చేకూర్చేందుకే సన్న రకం వరి సాగు చేయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారం కనుగొనాలన్న బాధ్యత భాజపాపై లేదా అని నిలదీశారు.