తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు! - తెరాస

రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా ఉండేందుకు తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ విలీనమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేల వరుస వలసలతో కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటామని అధికారికంగానే వెల్లడించారు. ఇదే బాటలో మరికొంత ఎమ్మెల్యేలు అడుగులు వేయబోతున్నట్లు  తెలుస్తోంది.

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!

By

Published : Mar 15, 2019, 9:08 AM IST

Updated : Mar 15, 2019, 2:45 PM IST

సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు పార్టీకి చెయ్యిచ్చి కారెక్కుతున్నారు. ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సీనియర్ నేత సబితతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు శాసనసభ్యులు అధికార పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పావులు కదుపుతోన్న తెరాస...

రాష్ట్రంలో తెరాస అమలు చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా అమలవుతుండటంతో హస్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని తెరాస వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా గల్లంతు చేయటమే లక్ష్యాన్ని కనిపిస్తోంది.ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ పార్టీని దెబ్బతీయాలని తెరాస పావులు కదుపుతోంది.

ప్రతిపక్షహోదాను గల్లంతు చేసేందుకే తెరాస వ్యూహం!

శాసనసభ్యుల్లో పదోవంతు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. కనీసం 12 లేదా అంతకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండాలి. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు గులాబీ కండువా కప్పుకుంటే... కాంగ్రెస్‌కు మిగిలేది 13మంది. ఇంకిందరు దూరమైతే శాసనసభలో ప్రతిపక్షహోదా పోయినట్లే. ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాతో పాటు ఆ పార్టీకి మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్​ రెడ్డిల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. ఈ ఇద్దరు లేకుంటే మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేనట్లే.

Last Updated : Mar 15, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details