Congress MLA Tickets Issues in Telangana 2023 : కాంగ్రెస్‌లో టికెట్ ప్రకటన సందర్భంగా చెలరేగిన అసమ్మతి క్రమంగా సర్దుకుంటోంది. టికెట్ వస్తుందని ఆశించిన నేతల్లో కొందరు పార్టీని వీడగా.. మరికొందరు రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. ఇంకొందరు పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులతో కలిసి పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 4 చోట్ల కాంగ్రెస్, ఒక్కచోట సీపీఐ అభ్యర్థులని ప్రకటించాల్సి ఉంది.
మూడో జాబితాలో వనపర్తి, బోథ్ అభ్యర్థులని మార్చారు. వనపర్తిలో పేరు మార్పుపై గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి (EX Minister Chinna Reddy)నిరసన వ్యక్తంచేశారు. చేవెళ్ల అభ్యర్థి భీం భరత్‌పై.. అందిన పలు అభియోగాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన ఏఐసీసీ.. ఆయనకు బీ ఫాం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన 114 సీట్లల్లో కేవలం 23 మంది బీసీలున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలో నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థిని మార్చి గాలి అనిల్‌కుమార్‌కు కేటాయిస్తే మరో బీసీ సీటు మరోకటి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న అసమ్మతి సెగ-మూడో జాబితా ప్రకటనతో చెలరేగిన ప్రకంపనలు
Telangana Congress MLA Tickets Disputes :ఈ నేపథ్యంలోనే ఆ సీటు మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న అభ్యర్థికే టికెట్ ఉంచాలంటూ దిల్లీ స్థాయిలో కొందరు చక్రం తిప్పుతుండడంతో.. అలాగే ఉండిపోయింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు.. గాలి అనిల్ కుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించి నామినేషన్ వేశారు. నిన్న సాయంత్రం.. ఆ నియోజకవర్గ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరగా అందుకు అంగీకరించినట్లు సమాచారం.