Congress MLA Tickets Applications 2023 :ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ ఆశావహుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు సమర్పించే గడువు ముగియగా.. సాయంత్రం వరకు 1017కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని ప్రముఖ నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ సహా ఇతరులు పోటీకోసం దరఖాస్తులు చేయగా.. చివరి రోజు కూడా పెద్ద సంఖ్యలో తమ పేర్లను ప్రతిపాదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ టికెట్ కోసం ఏకంగా 36 మంది పోటీపడుతున్నారు.
MP Komatireddy Counter to KCR : '50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?'
Telangana Assembly Elections 2023 :మధిర అసెంబ్లీ స్థానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తరపున గాంధీభవన్ ఇంఛార్జ్ కుమార్‌రావు దరఖాస్తు చేశారు. ములుగు టికెట్ కోసం సీతక్క.. పినపాక టికెట్ కోసం సీతక్క కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్‌రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చెయ్యగా.. మిర్యాలగూడ టికెట్(Miryalaguda Ticket) కోసం పెద్దకుమారుడు రఘువీర్‌రెడ్డి మరో దరఖాస్తు చేశారు. జానారెడ్డి ఈసారి దరఖాస్తు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. దామోదర రాజనర్సింహ పోటీకి తన పేరును ప్రతిపాదించారు. ముషీరాబాద్ టికెట్ కోసం అంజన్‌కుమార్ యాదవ్, కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ దరఖాస్తు చేశారు. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీగౌడ్, మంథని నుంచి శ్రీధర్‌బాబు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి దరఖాస్తు చేశారు. హుజూరాబాద్ నుంచి బల్మూరి వెంకట్ తనపేరును ప్రతిపాదించారు. కోదాడ, హుజూరాబాద్ నుంచి సినీ నిర్మాత అప్పిరెడ్డి దరఖాస్తు చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అర్జీలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌కి అందజేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ అవకాశం ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.