గాంధీ ఆస్పత్రికి వెంటనే 3వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కరోనా వచ్చిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికే రిఫర్ చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో రోజు 30 నుంచి 50 మంది చనిపోతున్నట్లు అనుమానంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయినా ఎవరూ ప్రశ్నించరని సీఎం కేసీఆర్ నమ్మకమని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.
గాంధీ ఆస్పత్రికి రూ.3వేల కోట్లు కేటాయించాలి: జగ్గారెడ్డి - covid-19
గాంధీలో కరోనా బాధితులకు సరిపడా స్టాఫ్ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆసుపత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రి కోసం రూ.3 వేల కోట్లు వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇందుకే నాలుగున్నర సంవత్సరాలు సైలెంట్‌గా ఉంటారని... ఎన్నికలకు ఆరు నెలల ముందు రైతులను రైతుబంధు పేరుతో మభ్యపెడతారని విమర్శించారు. రైతుల ఓట్లు ఎలాగైనా వస్తాయనే సీఎం ధీమాగా ఉన్నారని చెప్పారు. గాంధీలో సదుపాయాలు లేవని.. కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్యసిబ్బంది లేరని ఆరోపించారు. గాంధీ సూపరింటెండెంట్ సీఎం రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వైద్యులు, నర్సుల సేవలను తాము తప్పుపట్టడం లేదన్నారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్‌పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: వీహెచ్