రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా... తమకు అభ్యంతరం లేదని, కలిసి పని చేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తమకు అనుకూలమైన వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే...రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని.. లేనట్లయితే తమ నియోజక వర్గానికి పరిమితమై పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
Jagga Reddy: పీసీసీ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు - telangana varthalu
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదు
తమ పార్టీకి ఎలాంటి అధికారాలు లేవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదనిఆరోపించారు. అధికార పార్టీని ఎదురొడ్డి పోరాటం చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరేవారని... ఆయన తమపై ఉన్న కేసులను ఎదుర్కొనడం ఎలా అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. భాజపాలో చేరితే రాజేందర్‌పై ఉన్న కేసులను ఎదుర్కోవచ్చని భావించి ఉంటారన్నారు.
ఇదీ చదవండి:'రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాదే'