ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీని నడపడం వేరు.. జాతీయ పార్టీని నడపడం వేరని అన్నారు. గడపదాటకుండా నాలుగు గోడల మధ్య కూర్చుంటే జాతీయపార్టీ నడవదని ఎద్దేవా చేశారు.
'వాళ్లకే సాధ్యం కాలేదు.. మీతో ప్రాంతీయ పార్టీలు కూడా రావు' - కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్తలు
ప్రాంతీయ పార్టీని నడపడం వేరు.. జాతీయ పార్టీని నడపడం వేరని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ నవ్వుల పాలవుతారని వ్యాఖ్యానించారు.
'వాళ్లకే సాధ్యం కాలేదు.. మీతో ప్రాంతీయ పార్టీలు కూడా రావు'
ప్రధాని పదవిని ఆశించిన మాయావతి, శరద్పవార్కే అది సాధ్యం కాలేదని జగ్గారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ వెంట ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కలిసిరావని స్పష్టం చేశారు. శివసేన, తెరాసలవి వేరువేరు సిద్ధాంతాలన్నారు. సాధారణ జీవితం గడిపే మమత బెనర్జీ విలాస భవనంలో బతికే కేసీఆర్ జతకట్టదని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజలు డెమోక్రటిక్ సిస్టంకు అలవాటుపడ్డారని... అధ్యక్ష తరహా విధానానికి ప్రజలు అంగీకరించరని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం
TAGGED:
congress mla jaggreddy news