తెలంగాణ

telangana

ETV Bharat / state

షర్మిల వ్యవహారం.. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాగా ఉంది: జగ్గారెడ్డి - షర్మిల అరెస్టును ఖండించిన జగ్గారెడ్డి

Jagga Reddy on YS Sharmila Arrest: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. షర్మిల వ్యవహారమంతా బీజేపీ, టీఆర్​ఎస్ రాజకీయ డ్రామాగా ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

Jagga Reddy
Jagga Reddy

By

Published : Nov 30, 2022, 5:48 PM IST

Jagga Reddy on YS Sharmila Arrest: వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర అడ్డుకోవడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా షర్మిలపై జరిగిన దాడితో పాటు ఆమెను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. అయితే షర్మిల వ్యవహారమంతా బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ డ్రామాగా జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

షర్మిల రాజకీయం వెనుక ఉన్నదెవరని అనుమానం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. టీఆర్​ఎస్ లేదా బీజేపీ ఉపయోగపడేలా ఉందనే దానిపై చర్చ నడుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో గందరగోళ రాజకీయం నడస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కొన్ని పార్టీలు అండర్ స్టాండింగ్ రాజకీయాలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాదయాత్రలు ఫ్యాషన్ అయ్యాయని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. పాదయాత్రలో బండి సంజయ్ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అందరూ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చాలని కుట్ర పన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details