తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​పై వ్యాఖ్యలు వ్యక్తిగతం: జగ్గారెడ్డి - jagga reddy news

లాక్​డౌన్​ పొడిగించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

jaggareddy
లాక్​డౌన్​పై వ్యాఖ్యలు వ్యక్తిగతం: జగ్గారెడ్డి

By

Published : Apr 29, 2020, 4:28 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ డిసెంబరు వరకు ఉండాలని తాను చెప్పిన విషయం వ్యక్తిగతమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే చెప్పినట్లు వివరణ ఇచ్చారు. అమెరికా, ఇటలీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశానన్నారు. కొన్ని వర్గాలు లాక్​డౌన్​ను ఎత్తివేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే.. వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.1500 సరిపోవని... సర్కారుకు ఆర్థిక భారమైనా.. కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి:లాక్​డౌన్​ కొనసాగించాలి: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details