Congress MLA Candidates in Hyderabad 2023 :రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. దాదాపు నాలుగో వంతు స్థానాలు హైదరాబరాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇక్కడబీఆర్ఎస్(BRS), బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ బలహీనంగా ఉంది. మరో వైపు నియోజకవర్గాల వారీగా నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు తగిని చికిత్స చేసేందుకు పీసీసీ చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రధానంగా ఉప్పల్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ముషీరాబాద్ తదితర నియోజక వర్గాలల్లో నాయకుల మధ్య ఐఖ్యత కొరవడింది. తరచూ ఆయా నియోజక వర్గాలల్లో నాయకులు, కార్యకర్తల మధ్య వివాదాలు చెలరేగుతుండడం పీసీసీకి తలనొప్పిగా మారింది. నియోజక వర్గాల వారీగా కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు ఆశావహులు సిద్దంగా ఉన్నారు.
Congress MLA Tickets in Hyderabad 2023 :ఖైరతాబాద్ డీసీసీ పరిధిలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనుచరుడు.. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గత కొన్నిరోజులుగా జనంలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్లుతున్నారు. ఆయన తనకే బీ ఫాం వస్తుందన్నవిశ్వాసంతో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పీజీఆర్ కుమార్తె, కార్పోరేటర్ విజయారెడ్డి కూడా చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 :నాంపల్లి నుంచి గతంలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్‌ఖాన్ మరొకసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అంబర్‌పేట నుంచి ఓబీసీ సెల్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్‌లు పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. గోషామహల్ నుంచి కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగం రాష్ట్ర ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్వాన్ నుంచి ఉస్మాన్ హల్ హజ్రిలు పోటీ పడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమైన పీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమా.. నియోజక వర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆడెమ్ సంతోష్‌తోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నోముల ప్రకాష్, ఏఐసీసీ సభ్యుడు దీపక్‌జాన్‌లు కూడా బరిలో దిగేందుకు చొరవ చూపుతున్నారు.
Telangana Congress MLA Candidates 2023 : ముషీరాబాద్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ బరిలో దిగేందుకు సిద్దంగా ఉండగా, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా చొరవ చూపుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటి వరకు అభ్యర్ధి ఎవరు లేరు. హైదరాబాద్ డీసీసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ భాగం ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోంది.