Congress Ministers Medigadda Barrage Visit :మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ మంత్రుల బృందం సందర్శఇంచింది. కుంగిన పిల్లర్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఒకే విధానంతోనే ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి
గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రూ.38,000ల కోట్లతో, 16.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80,000ల కోట్లతో, 18 లక్షల ఎకరాలకు నీటిని ఇచ్చేందుకు నిర్ణయించిందని వివరించారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మేడిగడ్డ కుంగడం బాధాకరమైన విషయమని వాపోయారు. కానీ దీనిపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు.
"కాళేశ్వరం కంటే ప్రాణహిత ప్రాజెక్టు ఉత్తమమైనది. మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తి అయ్యేది. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80,000ల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచారు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టకు రూ.90,000ల కోట్లు ఖర్చు చేశారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయింది. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉంది." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి