Congress Ministers Counter on KTR : రాష్ట్రంలో అధికారంలో కోల్పోయినా, బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పులేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణలో మార్పు కావాలనే ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ రెండోసారి గెలిచాక మంత్రులు లేకుండా, 2నెలల పాటు పాలించారని అన్నారు. ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ పాలన సాగించారని మండిపడ్డారు.
'ప్రజలను అవమానిస్తూ కేసీఆర్ పాలన సాగించారు. ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 48 గంటల్లోనే అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇప్పటికే రూ.6.50 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయి. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాం. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు'- శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్
Sridhar Babu Fires on BRS Past Ruling : బీఆర్ఎస్ నేతల వైఖరి నవ్విపోదురుగాక, నాకేంటి అన్నట్లుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఓటమిపాలైనప్పటికీ బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 3500 రోజులు పాలించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాలేదని అప్పుడే సర్కార్‌పై కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని విరుచుకుపడ్డారు. మిగత హామీల అమలు కోసం ఓవైపు దరఖాస్తులు స్వీకరిస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. వారిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నడవదని, వారంత ఒకసారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని శ్రీధర్ బాబు సూచించారు.