తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నేతల డుమ్మా

రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన దృష్ట్యా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి పలువురు కాంగ్రెస్​ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపుపై ఆశించిన స్పందన లేదు.

సభ సన్నాహక సమావేశం

By

Published : Mar 7, 2019, 5:08 AM IST

Updated : Mar 7, 2019, 8:52 AM IST

సభ సన్నాహక సమావేశం

ఈ నెల 9న రాహుల్‌ గాంధీ పర్యటన ఖరారు కావడంతో పీసీసీ నేతృత్వంలో సన్నాహకసభ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, సీనియర్‌ నేతలు, లోక్​సభ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న పార్టీ నేతలు తదితరులను సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుపై క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 17 మంది ఎమ్మెల్యేల్లో పీసీసీ, సీఎల్పీతో సహా ఆరేడుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారు గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన నాయకులతో జనసమీకరణ, సభ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

పహాడి షరీఫ్‌ కాదు శంషాబాద్​...!

పహాడి షరీఫ్‌ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని ముందు భావించినప్పటికీ స్థానిక అధికారుల నుంచి అనుమతులు లభించలేదు. శంషాబాద్‌ ప్రాంతంలో సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సన్నాహక సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతోపాటు హరిప్రియ నాయక్‌, సీతక్క, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, జగ్గారెడ్డిలతో పాటుమరో 15 మంది డీసీసీ అధ్యక్షులు మాత్రమే హాజరయ్యారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:రేషన్​కార్డులు తొలగించట్లేదు

Last Updated : Mar 7, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details