తెలంగాణలో తాజా రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాకూర్ హాజరు కానున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో ఇందిరాభవన్‌లో ఆయన సమావేశమవుతారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కార్యనిర్వహక అధ్యక్షుడు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న పార్టీ సమీక్ష సమావేశంలో మాణిక్కం ఠాకూర్ పాల్గొంటారు. నవంబర్ 1వ తేదీన గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆ కార్యక్రమంలో ఠాకూర్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొంటారు.