హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై చర్చలే ప్రధాన అజెండాగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, వివిధ కమిటీల ఛైర్మన్‌లు, సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రులు హాజరయ్యారు.
హుజూరాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ సమాలోచనలు... పరిశీలనలో ఆ ముగ్గురు! - హుజూరాబాద్ ఎన్నికలు
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్లో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఇప్పటికే పీసీసీకి ఎన్నిక నిర్వహణ కమిటీ కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి పేర్లతో ఇచ్చింది. ఆ నివేదికతో పాటు ఆసక్తి చూపుతున్న నాయకుల గురించి సమావేశంలో చర్చించి అభ్యర్థి ఎవరనేది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే దామోదర రాజనరసింహ నేతృత్వంలోని ఎన్నికల నిర్వహణ కమిటీ ఆశావాహులతో చర్చించి... ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను రేవంత్‌రెడ్డికి అందించింది. పీసీసీ ద్వారా ఆ నివేదిక పార్టీ అధిష్ఠానానికి చేరింది. ఇవాళ్టి సమావేశంలో ఆ నివేదికతో పాటు ఆసక్తి చూపుతున్న నాయకులకు సంబంధించి చర్చించనున్నారు. కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి పేర్లతో కమిటీ జాబితా ఇచ్చింది. ముగ్గురి పేర్లపై మాణిక్కం ఠాగూర్ నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతలు మద్దతు చూపిస్తున్నారు. అభిప్రాయ సేకరణ అనంతరం తుది జాబితాను సోనియాకు అందించనున్నారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఇదీ చూడండి:BANDI SANJAY: భాజపా ఎప్పటికీ తెరాసతో కలిసి పోటీ చెయ్యదు